: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కు ఓటేయండి: మమతా బెనర్జీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ పోలింగ్ లో ఆప్ కు ఓటు వేయాలని ట్విట్టర్ లో కోరారు. "ఈ నెల 7న ఢిల్లీ ఎన్నికలు. ఏఏపీకు ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆప్ విజయం దేశానికి చాలా అవసరం. అంతేకాదు, ఢిల్లీ అభివృద్ధికి కూడా!" అని దీదీ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన చివరిరోజు మమతా ఇలా ప్రకటించడం విశేషం.

More Telugu News