: చంద్రబాబు, వైయస్ చేస్తే తప్పు కానిది... కేసీఆర్ చేస్తే తప్పా?: హరీష్ రావు
విపక్ష నేతలపై టీఎస్ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసం కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని... ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ హర్షించాలని అన్నారు. కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి విపక్షాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని విమర్శించారు. నిజాం షుగర్స్ ను, ఆల్విన్ ఆస్తులను చంద్రబాబాబు అమ్మితే ఎవరూ మాట్లాడలేదని, వక్ఫ్ భూములను వైయస్ అమ్మితే దార్శనికుడు అన్నారని... ఇప్పుడు ప్రజల అవసరాల కోసం నిధులను సేకరించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే మాత్రం తప్పుబడుతున్నారని మండిపడ్డారు.