: ఎమ్మెల్యేనంటూ వైసీపీనేత నకిలీ ఫేస్ బుక్ ఖాతా... పలువురి నుంచి నగదు వసూలు!

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఆకతాయిలు బెదిరింపులు, మోసాలకు పాల్పడుతుండడం తెలిసిందే. ఇప్పుడో పార్టీ నేత కూడా అలాగే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గాదె బాలారెడ్డి హైదరాబాదులోని ముషీరాబాద్ ఎమ్మెల్యేనంటూ ఫేస్ బుక్ లో ఖాతా తెరిచాడు. సెటిల్ మెంట్లు చేస్తానంటూ పలువురి నుంచి డబ్బు తీసుకున్నాడట. అలా మోసపోయి అసలు విషయం తెలుసుకున్న శాస్త్రి, సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో బాలారెడ్డి ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారని, అయినా ఎమ్మెల్యేనంటూ ఎఫ్ బీ ఖాతా తెరిచారని వివరించారు. ప్రస్తుతం ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

More Telugu News