: పోలీసు జీపును ఢీకొన్న లారీ... చిత్తూరు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి

చిత్తూరు జిల్లాలో నేటి ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మృత్యువాతపడ్డారు. చెన్నై నుంచి వస్తున్న పోలీసు వాహనం (స్కార్పియో)ను తమిళనాడు, ఏపి సరిహద్దు నరహరిపేట (చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం) చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లికి వస్తున్న క్రమంలో పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది.

More Telugu News