: తృణమూల్ ఎంపీ సృంజోయ్ బోస్ కు బెయిల్

పశ్చిమ బెంగాల్ ను కుదిపేసిన శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో 2014 నవంబర్ 21న అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సృంజోయ్ బోస్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రెండున్నర నెలలపాటు కారాగారవాసం అనుభవించిన ఎంపీకి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. గతంలో బెయిల్ కోసం ఎంపీ చేసుకున్న దరఖాస్తును న్యాయస్థానం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News