: అన్నా హజారే దీవించారు: కేజ్రీవాల్

అన్నా హజారే దీవెనలు అందించారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వ్యక్తిగతంగా దీవెనలు అందించారని అన్నారు. ఢిల్లీకి ఆప్ సమర్థవంతమైన పాలన అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఓటమి భయంతో బీజేపీ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. కాగా, 2011లో అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

More Telugu News