: మోహన్ లాల్ మనీ రిఫండ్ ను తిరస్కరించిన కేరళ సీఎం
కేరళలో జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'లాలిసోమ్' బ్యాండ్ కచేరీ ప్రేక్షకులను నిరాశపరచడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకుగానూ తీసుకున్న రూ.1.6 కోట్లు వెనక్కిచ్చేస్తానని లాల్ ప్రకటించారు. తాజాగా దీనిపై కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ స్పందిస్తూ, ఆ డబ్బు తిరిగి తీసుకోమన్నారు. "మోహన్ లాల్ నుంచి డబ్బును స్వీకరించబోము. ఇందులో ఎలాంటి సందేహంలేదు. లీగల్ కాంట్రాక్ట్ లో భాగంగా ఆ డబ్బు ఇచ్చాము" అని చాందీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, విమర్శలెదుర్కొంటున్న మోహన్ లాల్ కు మరో సూపర్ స్టార్ మమ్ముట్టి మద్దతు పలికారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో కష్టపడతారన్నారు. మోహన్ లాల్ అందరికీ గర్వకారణమన్నారు. ఆ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకొచ్చిన ఆయనను అందరూ అభినందించాలని మీడియాతో మమ్ముట్టి తెలిపారు.