: గుప్తనిధుల కోసం గర్భాలయంలో తవ్వకాలు... దేవుడి విగ్రహం ధ్వంసం

గుప్తనిధులు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఆలయంలోని గర్భగుడిని తవ్వి, దేవుడి విగ్రహాన్నే పగులకొట్టారు దుండగులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు గర్భగుడిలోని మూలవిరాట్టును ధ్వంసం చేశారు. స్వామివారి రాతి విగ్రహం చేయి, మురళి, తలమీది పింఛాకృతులు పగిలిపోయాయి. కొన్ని రోజులుగా ఈ ఆలయంలో పూజలు జరగడం లేదని, అందుకే ఈ చర్యకు పాల్పడి ఉంటారని గ్రామస్థులు అంటున్నారు. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

More Telugu News