: స్వైన్ ఫ్లూ నుంచి కోలుకుని 'బర్త్ డే' జరుపుకున్న ఎంపీ కొత్తపల్లి గీత
స్వైన్ ఫ్లూ బారిన పడిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ఈరోజు తన పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వైన్ ఫ్లూ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురైన ఎంపీ విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే పరీక్షలు నిర్వహించగా స్వైన్ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.