: పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానుకోండి: కేసీఆర్ కు తమ్మినేని సూచన

అద్భుతంగా ఉన్న ప్రస్తుత తెలంగాణ సచివాలయాన్ని తొలగించి, ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం కేసీఆర్ మానుకోవాలని సూచించారు. వాస్తు దోషం ఉంది కనుక సచివాలయాన్ని మారుస్తామంటున్న కేసీఆర్... ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. వేలాది మంది పేద ప్రజలకు సేవలందిస్తున్న చెస్ట్ ఆసుపత్రిని తరలించాలన్న ఆలోచనను విరమించుకోవాలని సూచించారు.

More Telugu News