: నాంపల్లి కోర్టుకు జగన్... అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కు వాయిదా
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మూడు కేసులపై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ విచారణకు జగన్ తో పాటు ప్రముఖ ఆడిటర్, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. మూడు కేసుల్లో తదుపరి విచారణను కోర్టు మార్చి 6కు వాయిదా వేసింది.