: గణపతి సమాచారమిస్తే... రూ.2.52 కోట్లిస్తాం: విశాఖ మన్యంలో సీఆర్పీఎఫ్ పోస్టర్లు

మావోయిస్టు దళపతి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ చెబితే రూ.2.52 కోట్లు ఇస్తామన్న పోస్టర్లు విశాఖ మన్యంలో వెలిశాయి. మావోయిస్టుల ఏరివేత కోసం రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ ఈ పోస్టర్లను అంటించింది. తెలుగు నేలకు చెందిన గణపతి, మావోయిస్టు ఉద్యమంలో చేరిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నారు. గణపతి పేరు చెబితే... తెలుగు రాష్ట్రాల కంటే మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలే అధికంగా భయపడతాయి. ఈ నేపథ్యంలో గణపతిని పట్టించి ఇచ్చినా, లేదంటే కేవలం ఆచూకీ చెప్పినా భారీ పారితోషికమిస్తామని ఆ రాష్ట్రాలు ప్రకటించాయి. గణపతి కోసం కేంద్రంతో పాటు రాష్ట్రాలు ప్రకటించిన పారితోషికాలన్నీ కలిపితే, రూ.2.52 కోట్లు అవుతోంది. దీంతోనే గణపతి ఆచూకీ చెబితే రూ.2.52 కోట్లు ముట్టజెబుతామంటూ సీఆర్పీఎఫ్ పోలీసులు పోస్టర్లు అంటించారు.

More Telugu News