: ఇంగ్లాండ్ కు అంత సీన్ లేదు: హాజిల్ వుడ్

వరల్డ్ కప్ కు చాలా ముందుగా ఆసీసీ ఆటగాళ్లు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. ఆసీస్ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై ఆసీస్ బౌలర్ హాజిల్ వుడ్ మాటల తూటాలు పేల్చాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తమను ఓడించే సత్తా లేదని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ వేదికలపై ఆసీస్ ఇంగ్లాండ్ ను చిత్తు చేసిందని అన్నాడు. ఈ వరల్డ్ కప్ లో కూడా అదే పునరావృతమవుతుందని హాజిల్ వుడ్ స్పష్టం చేశాడు. కాగా, ప్రధాన టోర్నీల్లో విజయం సాధించేందుకు ఆస్ట్రేలియా నోటికి పని చెప్పి, మానసికంగా వారిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుంది. తాజా వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News