: 20 నిమిషాల్లోనే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు అయిపోయాయి!

ఈ నెల 14న ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ గా అభిమానులు భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈనెల 15న అడిలైడ్ లో భారత్-పాకిస్థాన్ తలపడనుండగా, ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచిన టిక్కెట్లన్నీ అమ్ముడు పోయాయి. ఈ ఉదయం విక్రయాలు ప్రారంభించగా, 20 నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంచిన అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కాగా, ఈ మ్యాచ్ ని సుమారు 130 కోట్ల మంది అభిమానులు టీవీల ద్వారా చూస్తారని అంచనా. ఇప్పటివరకు ప్రపంచకప్ లో భారత్ పై పాకిస్థాన్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఆ రికార్డును కొనసాగించాలని ఇండియా, దాన్ని చేరిపేయాలని పాకిస్థాన్ గట్టి పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి.

More Telugu News