: ఢిల్లీలో ఇంటింటికీ లేఖలు పంపనున్న బీజేపీ

మరో నాలుగు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో బీజేపీ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ర్యాలీలు, బహిరంగ సభలు, సోషల్ మీడియా ద్వారానే కాకుండా, లేఖల రూపంలోనూ ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాజధానిలో ఇంటింటికీ లేఖలు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు కోటి 20 లక్షల మంది ఇళ్లకు లేఖలు పంపాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఢిల్లీలో తాము చేపట్టే అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేగాక, బీజేపీకి అధికారం కట్టబెడితే మహిళలకు రక్షణ, అవినీతిపై చర్యలు, 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై లేఖలో హామీ ఇచ్చింది. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ లేఖలో కోరారు.

More Telugu News