: మాకేం పనిలేక ఉన్నామా?: నల్గొండ కలెక్టర్ ఆగ్రహం
‘‘నువ్వు ఆఫీసులో ఉంటే... మేం పని లేక గ్రీవెన్స్‌లో ఉన్నామా? కిందిస్థాయి ఉద్యోగిని పంపించి నువ్వేమి చేస్తున్నావు? 10 నిమిషాల్లో గ్రీవెన్స్‌లో ఉండాలి’’ అంటూ జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్ పై నల్గొండ కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఫోన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలోని గరిడేపల్లి మండలం పొనుగోడు పీఏసీఎస్ లో ఎరువులను అధిక ధరలకు అమ్ముతుండడంతో పాటు సొసైటీకి వచ్చే ఎరువులను వ్యాపారులకు విక్రయిస్తున్నారని కొంతమంది రైతులు ఫిర్యాదు చేయగా కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. "తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తే మీకు పట్టదా? గ్రీవెన్స్ డేకు హాజరు కాకుండా ఏం చేస్తున్నావు?" అంటూ మండిపడ్డారు. సొసైటీని తనిఖీ చేసి నివేదికను అందించాలని డీసీఓను ఆదేశించిన కలెక్టర్, విధుల్లో అలసత్వం వహించిన అధికారికి మెమో జారీ చేయాలని సూచించారు.