: రాష్ట్రం నీ అయ్య జాగీరనుకున్నావా?: కేసీఆర్ పై మోత్కుపల్లి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ టీడీపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఒంటికాలిపై లేచారు. సచివాలయం తరలింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు నిదర్శనమని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నిన్న టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో కలిసి ఆయన చెస్ట్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సచివాలయాన్ని ఛాతీ ఆసుపత్రికి తరలించి ఆకాశమెత్తు భవనాలు కడ్తడట. ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ పంపిస్తడట. నీ ఇష్టమొచ్చినట్లు చేయడానికి తెలంగాణ నీ అయ్య జాగీరు కాదు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News