: వరల్డ్ కప్ పాక్ జట్టుకు షాక్...ఇబ్బందుల్లో టీమిండియా

పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్ జట్టుకు షాక్ తగిలింది. ఫిట్ నెట్ సమస్యల కారణంగా పాక్ జట్టులో కీలక బౌలర్ జునైద్ ఖాన్ వరల్డ్ కప్ నుంచి వైదొలగాడు. లాహోర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కసరత్తు చేస్తుండగా జునైద్ గాయపడ్డాడు. దీంతో అతనిని చికిత్సకు తరలించారు. ఫిట్ నెస్ పరీక్షలో అర్హత సాధించలేకపోయాడు. దీంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఫిట్ నెస్ సాధించలేకపోవడంతో టోర్నీకి దూరమవడంతో తన హృదయం బద్దలైందని జునైద్ తెలిపాడు. జట్టుకోసం ప్రార్థన చేస్తానని చెప్పాడు. కాగా, టీమిండియాది కూడా అదే పరిస్థితి. టీమిండియా ప్రధాన బౌలర్ ఇషాంత్ శర్మకు కూడా ఫిట్ నెస్ లేదు. దీంతో ఫిట్ నెస్ టెస్టులో అర్హత సాధిస్తాడా? లేక టీమిండియాకు షాక్ ఇస్తాడా? అనేది త్వరలోనే తేలనుంది. ఇషాంత్ టోర్నీ నుంచి బయటికి వస్తే మోహిత్ శర్మకు అవకాశాలు మెరుగవుతాయి. అదే సమయంలో టీమిండియా విజయావకాశాలు కూడా తగ్గిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

More Telugu News