: టీమిండియాకు బీసీసీఐ బంపర్ ఆఫర్

టీమిండియాకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారం రోజులు హాలీడే ప్రకటించింది. వరల్డ్ కప్ పై ఆశలు వదిలేసుకోవాలంటూ ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్ లో తమ పేలవ ఆటతీరు ద్వారా అభిమానులకు చాటి చెప్పిన టీమిండియా ఆటగాళ్ల ఇంటి బెంగను బీసీసీఐ తీర్చనుంది. సుదీర్ఘ షెడ్యూల్ తో ఇంటికి దూరమైన టీమిండియా ఆటగాళ్ల అలసట తీర్చేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపవచ్చని తెలిపింది. దీంతో వారం రోజులపాటు జాలీ ట్రిప్స్ కు ఆటగాళ్లు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు బీసీసీఐ అనుమతివ్వడంతో ఆటగాళ్లు సంబరపడుతున్నట్టు సమాచారం. అందరికంటే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ ఆనందపడుతున్నాడట. నాలుగు వారాలుగా ప్రేయసికి దూరంగా ఉంటున్న విరాట్ వన్డేల్లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. అది టీమిండియా విజయాలపై పెను ప్రభావం చూపింది. దీంతో, తాము అలసిపోయామని, కుటుంబ సభ్యులతో కలిసేలా చూడాలని సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి సిఫారసు చేశారు. దీంతో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.

More Telugu News