: ఢిల్లీ పీఠం బీజేపీదే... 'ది వీక్ - ఐఎంఆర్బీ' సర్వే
హస్తినలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ, ఆప్ లు శాయశక్తులా శ్రమిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారం చేస్తూ దేశ రాజధానిని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పీఠంపై ఏ పార్టీ కూర్చుంటుందనే విషయంపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఏ పార్టీకి ఓటరు అధికారం కట్టబెడతాడన్న విషయాన్ని తేల్చేందుకు ది వీక్-ఐఎంఆర్బీ సర్వే నిర్వహించింది. క్లియర్ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఈ సర్వేలో స్పష్టమైంది. మొత్తం 70 స్థానాలకు గాను 36 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందట. 29 సీట్లను ఆప్ కైవసం చేసుకుంటుందని, నాలుగు సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంటుందని సర్వేలో వెల్లడైంది. కేజ్రీవాల్ సీఎం కావాలని 40 శాతం మంది ఓటర్లు కోరుకుంటుండగా, కిరణ్ బేడీ ముఖ్యమంత్రి కావాలని 39 శాతం మంది కోరుకుంటున్నారట.
ఇండియా టీవీ - సీఓటర్ నిర్వహించిన మరో సర్వేలో బీజేపీకి 37, ఆప్ కు 28 సీట్లు వస్తాయని తేలింది.