: చిక్కుల్లో కేజ్రీవాల్... ఢిల్లీ హైకోర్టు నోటీసు

కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. కేజ్రీవాల్, ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపండి' అంటూ కేజ్రీని వివరణ కోరింది. అటు, ఈసీని కూడా కోర్టు వివరణ కోరింది. కేజ్రీవాల్ స్థానికుడు కాదని, యూపీ స్థానికత ఉన్న వ్యక్తి ఢిల్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పైవిధంగా చర్యలు తీసుకుంది. అంతేగాక, కేజ్రీ తప్పుడు అడ్రస్ ఇచ్చి, ఢిల్లీ ఓటర్ కావాలనుకున్నారని, తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించి మోసానికి పాల్పడ్డారని వాలియా పిటిషన్ లో ఆరోపించారు. ఈ విషయాన్ని ఈసీకి తెలిపి ఎన్నికల జాబితా నుంచి కేజ్రీ పేరును తొలగించాలని కోరానని, ఈ విషయంలో దర్యాప్తు చేయాలని కూడా అడిగినట్టు చెప్పారు.

More Telugu News