: హైదరాబాదు బోరబండలో విషాదం... రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా చూసుకుని వెళ్లాలన్న హెచ్చరికను పాటిస్తున్న వారు చాలా తక్కువ మందే. ఆదరా బాదరాగా రైలు పట్టాలు దాటుతూ, ముందూవెనుకా చూసుకోకుండా పట్టాలపై నడుస్తూ మృత్యువాత పడుతున్న వ్యక్తుల సంఖ్య హైదరాబాదులో ఎక్కువే. ఈ సంఖ్య బోరబండ, భరత్ నగర్ పరిధిలో మరింత అధికమనే చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం ఈ తరహాలోనే బోరబండలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు మహిళలు రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.