: పని చేస్తున్న కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఉన్నతాధికారి
అనంతపురం జిల్లా సాక్షర భారత్ కార్యాలయంలో దారుణం జరిగింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నేటి ఉదయం 9 గంటలకు కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య తన సీటు వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్యాలయానికి వచ్చిన ఇతర ఉద్యోగులు ఈశ్వరయ్య ఆత్మహత్యను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్టు వివరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.