: హరీష్ భయంతోనే కేసీఆర్ సచివాలయం మార్చాలంటున్నారు: మల్లు భట్టివిక్రమార్క

అల్లుడు హరీష్ రావు భయంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం మారుస్తానంటున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వాస్తు పేరిట ప్రభుత్వ ఆస్తులను ఫణంగా పెట్టడం సరికాదని అన్నారు. మూఢనమ్మకాలను వదిలి, సైంటిఫిక్ గా, లాజికల్ గా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ప్రజలు కూడా అనుసరిస్తారని ఆయన హితవు పలికారు. సచివాలయాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు. సెక్రటేరియట్ ను మార్చాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించడానికే ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పిన ఆయన, అనవసర పనులు మానేసి సుపరిపాలనపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చారు.

More Telugu News