: హురియత్ లీడర్ పై తక్షణం చర్యలు తీసుకోండి: వీర జవాన్ల కుటుంబీకులు

హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్గిల్ మరణంలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలు డిమాండ్ చేశాయి. ధర్మశాలలో ఆ మేరకు వారు మాట్లాడుతూ, హురియత్ నేతలు పాకిస్థాన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రిపబ్లిక్ డే నాడు వీర పురస్కారం పొందిన కల్నల్ రాయ్ మరునాడే ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే కల్నల్ ను చంపిన ఉగ్రవాదులను ధైర్యవంతులుగా హురియత్ కాన్ఫరెన్స్ నేత సయీద్ అలీ షా గిలానీ పేర్కొన్నారు. దీనిపై వీర జవాన్ల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రిటైర్డ్ శాస్త్రవేత్త ఎన్ కే కాలియా (72) మాట్లాడుతూ, గిలానీ వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. దీనిపై కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలియా కార్గిల్ పోరాటంలో వీరమరణం పొందిన విక్రమ్ బాత్రా తండ్రి.

More Telugu News