: ఆప్ ను గెలిపిస్తే వెనక్కి తీసుకెళ్లారు: మోదీ

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు గెలిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని వెనక్కి తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ సమర్థవంతమైన నేత అని అన్నారు. ఆమెను ముఖ్యమంత్రిని చేస్తే సమున్నతమైన అభివృద్ధి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి 7 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారని, అదే రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రజలను కొందరు మోసం చేస్తున్నారని, ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేరని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో మెజారిటీకి కొన్ని స్థానాల దూరంలో నిలబడిన బీజేపీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదని ఆయన వెల్లడించారు. ఆప్ కు ఓటు వేసి గెలిపిస్తే వారు బాధ్యతను మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

More Telugu News