: సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాల్సిన అవసరం లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాదులో ప్రస్తుతం ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ఉన్నచోట కొత్తగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయ భవనాన్ని నిర్మించాలని సర్కారు ఆలోచన చేస్తోంది. అందుకోసం ఎర్రగడ్డ ఆసుపత్రిని వేరేచోటకి తరలించాలని అనుకుంటోంది. ఈ నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సచివాలయం తరలింపుపై అఖిలపక్షంలో చర్చించకుండా నిర్ణయమెలా తీసుకుంటారని ప్రశ్నించారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాల్సిన అవసరం లేదన్నారు. నిజాం రాజుల గుర్తుగా కట్టుకున్నచోట సీఎం కేసీఆర్ భవనాలు ఎందుకు కట్టాలనుకుంటున్నారని అడిగారు. ఏపీ సచివాలయం ఆంధ్రాకు వెళ్లాక అంతా ఖాళీగానే ఉంటుందన్నారు. సీఎం తొందరపాటు నిర్ణయాలవల్లే అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నారు.