: ఇన్ని అబద్ధాలూ, మోసాలా?... చంద్రబాబుపై జగన్ విసుర్లు

తాను చేస్తున్న రెండురోజుల నిరాహార దీక్ష రైతులు, ప్రజల కోసమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ తెలిపారు. ఈ మధ్యాహ్నం తణుకులో రెండు రోజుల నిరాహార దీక్షకు కూర్చున్న ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చిన మాటను చంద్రబాబు తప్పారని, అందువల్ల టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే దీక్ష తలపెట్టానని జగన్ తెలిపారు. డ్వాక్రా మహిళల నుంచి రైతులు, నిరుద్యోగుల వరకూ తన అబద్ధాలతో బాబు మోసం చేశారని ఆరోపించారు. దీక్ష ముగిసిన తరువాత సుదీర్ఘంగా ప్రసంగిస్తానని వెల్లడించిన జగన్ అధికారికంగా నిరాహార దీక్షను ప్రారంభించారు.

More Telugu News