: ఒంగోలులో కలకలం... స్వైన్ ఫ్లూ తో మహిళ మృతి

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో స్వైన్ ఫ్లూ మహమ్మారి కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోకిల (75) అనే మహిళ ఈ ఉదయం చనిపోయింది. ఈమె మృతితో ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో, జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్వైన్ ఫ్లూ నివారణకు అవసరమైన చర్యలను చేపట్టినట్టు తెలిపింది.

More Telugu News