: ఆచరణ సాధ్యం కాని పథకాలు వద్దు: సుప్రీంకోర్టు
ఆచరణ సాధ్యం కాని పథకాలు రూపొందించవద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేయడానికి ఉధ్దేశించి రూపొందించిన 'బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రావాన్ యోజన' పథకాన్ని ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా, ఛాత్రావాన్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించాలనే ఆలోచనలో కేంద్రం ఉంది.