: యూట్యూబ్ లో 'బాహుబలి' సీన్లు... లీక్ పై రాజమౌళి ఫిర్యాదు

ప్రతిష్ఠాత్మక రీతిలో తెరకెక్కుతున్న బాహుబలి సినిమాకు చెందిన సీన్లు లీకయ్యాయంటూ దర్శకుడు రాజమౌళి ఫిర్యాదు చేశారు. సినిమా సన్నివేశాలను యూట్యూబ్ లో పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాదు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు 'బాహుబలి' యూనిట్ సిబ్బందిని విచారిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోగా ప్రభాస్, ప్రతినాయకుడిగా రానా నటిస్తున్నారు. అనుష్క, తమన్నా కథానాయికలు.

More Telugu News