: నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నావ్... కేసీఆర్ పై కాంగ్రెస్ ఫైర్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నారని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. వాస్తుదోషం ఉందన్న పేరుతో నగర నడిబొడ్డులోని సచివాలయాన్ని తనవారికి బేరం పెట్టాలని ఆయన చూస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ వ్యక్తిగత ఆలోచనలు పక్కనపెట్టి ప్రజల మేలు కోసం ఆలోచించాలని జీవన్ రెడ్డి సూచించారు. రాచరికం, రాజ్యాలు, రాజుల పాలన ఎప్పుడో పోయాయని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

More Telugu News