: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి నివాళులు
జాతిపిత మహాత్మగాంధీ 67వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంజలి ఘటించారు. సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా నివాళులు తెలిపారు. ఇటు, హైదరాబాదులోని బాపు ఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ తదితరులు నివాళులర్పించారు.