: ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మైక్రోసాప్ట్ 'అవుట్ లుక్ యాప్'
సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ ప్రవేశపెట్టింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అవుట్ లుక్ యాప్ ను తీసుకొచ్చింది. అకాంప్లీ పేరిట ఇంతకుముందు ఉన్న ఈ-మెయిల్ స్టార్టప్ స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. అవుట్ లుక్ సర్వీసు ఆఫీస్ 365, ఎక్స్చేంజ్, అవుట్ లుక్.కామ్, యాహూ మెయిల్, జీమెయిల్, ఐక్లౌడ్, ఇతర ఈ-మెయిల్ సర్వీసులను ఇది సపోర్టు చేస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా షెడ్యూలింగ్ కు వీలుంటుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఈ యాప్ సాయంతో యూజర్లు డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ నుంచి ఫైళ్లను అటాచ్ చేసుకోవచ్చు.