: ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత ఉండవల్లికి లేదు: బీజేపీ

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై బీజేపీ మండిపడుతోంది. ఈ అంశం గురించి మాట్లాడే అర్హత అయనకు లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎంపీగా ఉన్న ఉండవల్లి రాష్ట్రం గురించి కనీసం 5 నిమిషాలు కూడా లోక్ సభలో ప్రసంగించలేదని ఎద్దేవా చేశారు. ఉండవల్లి తన జ్ఞానాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు.

More Telugu News