: హెయిర్ డై తాగి కావలిలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఇటీవల పలు కారణాలతో అమ్మాయిలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, నెల్లూరు జిల్లా కావలిలో భారతి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయగిరి మండలం కొండారెడ్డిపాలెం గ్రామానికి చెందిన భారతి కావలి విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ఆమె తలకు వేసుకునే రంగు (హెయిర్ డై) తాగింది. ఈ విషయం గుర్తించిన కళాశాల మేనేజ్ మెంట్ విద్యార్థినిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భారతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

More Telugu News