: ఓటరుకు నెక్లెస్ బహుమతిగా ఇస్తూ కనిపించిన కిరణ్ బేడీ... ఆప్ ఫిర్యాదు

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ పోలీసు అధికారి కిరణ్ బేడీ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఒక మహిళకు ముత్యాల నెక్లెస్ ఇస్తూ ఆమె కనిపించారు. ఆమె ఓటర్లకు లంచాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తూర్పు ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. "వారు ప్రత్యక్షంగా నెక్లెస్ లు ఇస్తూ, ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతోంది" అని 'ఆప్' నేత మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా, ఇతర పార్టీలు ఇచ్చే బహుమతులు తీసుకోవాలని, ఓటు మాత్రం తమకే వేయాలని కేజ్రీవాల్ అనడాన్ని ఎలక్షన్ కమిషన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

More Telugu News