: సచిన్ లేకుండా భారత్-పాకిస్థాన్ మ్యాచ్... వరల్డ్ కప్ చరిత్రలో ఇదే ప్రథమం!

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. అది వరల్డ్ కప్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లో ఆట కంటే ఆవేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మాటల యుద్ధాలు మామూలే. ఇప్పటివరకు దాయాదులు వరల్డ్ కప్ చరిత్రలో ఐదు సార్లు తలపడ్డారు. అన్నింటా విజయం భారత జట్టుదే. విశేషమేంటంటే... ఈ ఐదు పర్యాయాలు భారత జట్టులో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. తొలిసారి సచిన్ 1992 వరల్డ్ కప్ లో ఆడాడు. భారత్-పాక్ జట్లు వరల్డ్ కప్ లో తొలిసారి తలపడింది ఆ టోర్నీ ద్వారానే. ఇప్పుడు సచిన్ రిటైర్మెంటు ప్రకటించాడు. తాజా వరల్డ్ కప్ లో షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ ఫిబ్రవరి 15న అడిలైడ్ ఓవల్ లో తలపడుతున్నాయి. గత మ్యాచ్ లలో తన ప్రతిభ, అనుభవంతో జట్టు పైచేయి సాధించడానికి తోడ్పడిన ఈ బ్యాటింగ్ దేవుడు ఇప్పుడు వీక్షకుడయ్యాడు. దీంతో, దాయాదితో పోరులో భారత్ ఎలా ఆడుతుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

More Telugu News