: కేసీఆర్ అంగీకరిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ: టీ.టీడీపీ ఎమ్మెల్యే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరతానని కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తానొక్కడినే కాకుండా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీతో టచ్ లో ఉన్నారని తెలిపారు. 26 కులాలను బీసీల నుంచి తొలగించడంతో తన నియోజకవర్గంలో వేలాదిమంది ఇబ్బంది పడుతున్నారని, వాళ్లని బీసీ జాబితాలో చేర్చాలన్నదే తన కోరికని మాధవరం పేర్కొన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు సొంత పార్టీ నేతలు తనకు అండగా నిలవలేదని, ఆ అంశం తనకు అసంతృప్తి కలిగించిందని చెప్పుకొచ్చారు. తనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదంటూ రెండు రోజుల కిందట నారా లోకేష్ ను కలిసిన సందర్భంగా మాధవరం, తాను టీఆర్ఎస్ లో చేరతానని ఎప్పుడూ అనలేదన్నారు. అనూహ్యంగా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవడం గమనార్హం.

More Telugu News