: కిస్ చేతిలో వీనస్ ఓటమి: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్!

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి విలియమ్స్ సోదరి వీనస్ విలియమ్స్ నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాడిసన్ కిస్ చేతిలో వీనస్ పరాజయం పాలైంది. 3-6, 6-4, 4-6 స్కోరు తేడాతో కిస్ చేతిలో ఓటమి చవిచూసిన వీనస్ టోర్నీ నుంచి వైదొలగింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ లతో పాటు మహిళల సింగిల్స్ లో అజరెంకా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఈ ఏడాది కొత్త తరం చాంపియన్లు అవతరించే అవకాశాలున్నాయి.

More Telugu News