: ఆ బాక్సుల్లోని పేలుడు పదార్థాలే కారణమా?: పరారీలో ‘చాగల్లు’ బస్సు డ్రైవర్, క్లీనర్, ట్రావెల్స్ యాజమాన్యం

నిన్న రాత్రి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు వద్ద అగ్నికి ఆహుతి అయిన బస్సు దుర్ఘటనపై ఉలవపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బస్సులోని లగేజీ క్యారియర్ లో కొన్ని బాక్సులపై ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోనే బస్సు డిక్కీలోకి చేరిన సదరు బాక్సుల్లో స్వీట్లు ఉన్నాయని డ్రైవర్ చెప్పాడని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే వాటిలో పేలుడు పదార్థాలున్నట్లు అనుమానాలున్నాయని వారు పోలీసులకు చెప్పారు. ఇదిలా ఉంటే, ప్రమాదం జరిగిన వెంటనే బస్సును నిలిపేసి ప్రయాణికులను అప్రమత్తం చేసిన డ్రైవర్, క్లీనర్ తో పాటు పరారయ్యాడు. అంతేకాక డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న పర్వీన్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News