: రాజయ్య కొన్ని గంటల్లో డిశ్చార్జి అవుతారు... గుండెపోటు కాదు: పెద్ది సుదర్శన్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గుండెపోటుకు గురికాలేదని, ఆయన ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోనందున రక్తపోటు, షుగుర్ లెవెల్స్ పెరిగాయని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం మినిస్టర్స్ క్వార్టర్స్ లో తామిద్దరం మాట్లాడుకున్నామని, ఆయన ఉదయం అల్పాహారం తీసుకోలేదని తెలిసిందని వివరించారు. రాజయ్య తనకు సన్నిహితుడని, ఆయనకు గుండెపోటు అని ప్రచారం చేయడం సరికాదని సూచించారు. ఆయన భేషుగ్గానే ఉన్నారని, కొన్ని గంటల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సుదర్శన్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News