: రాజస్థాన్ లో కూలిన మిగ్-27... పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళుతున్న వ్యక్తికి గాయాలు!


మిగ్ విమానాలకు కాలం చెల్లిందన్న నిపుణుల వాదనలకు బలం చేకూరేలో మరో విమానం నేలకూలింది. రాజస్థాన్ లోని బార్మెర్ ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన మిగ్-27 ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే, అందులోని పైలట్ సురక్షితంగా బయటపడడంతో వాయుసేన ఊపిరిపీల్చుకుంది. కాగా, ఈ విమాన శకలం లూన్ సింగ్ (26) అనే వ్యక్తిని గాయపరిచింది. పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు బైక్ పై వెళుతున్న అతడిని విమాన శకలం బలంగా తాకగా, ఆ యువకుడి చేయి విరిగిపోయింది. బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఈ రష్యా తయారీ విమానం రోజువారీ విన్యాసాల్లో భాగంగా జోథ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి ఉత్తర్లాయ్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై వాయుసేన 'కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ'కి ఆదేశించింది.

  • Loading...

More Telugu News