: 'విష్ యూ ఎ సేఫ్ జర్నీ' అంటూ ఒబామాకు మోదీ వీడ్కోలు
మూడు రోజుల భారత పర్యటన ముగించుకుని వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లోనూ వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా 'విష్ యూ ఎ సేఫ్ జర్నీ' అంటూ ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు. భారత్-యూఎస్ఏ మధ్య కొత్త సంబంధాలు ఏర్పడ్డాయని, ఆయన పర్యటన కొత్త అధ్యాయానికి తెరలేపిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు తక్కువ సమయంలోనే 1,477 మంది రీట్వీట్ చేశారట. కాగా, భారత్ నుంచి ఒబామా సౌదీ అరేబియా బయలుదేరి వెళ్లారు.