: అనుకోని విధంగా డిప్యూటీ సీఎం అయ్యా: కడియం
తెలంగాణ ఉపముఖ్యమంత్రి కావడం పట్ల మంత్రి కడియం శ్రీహరి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనుకోని సమయంలో అనుకోని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఈ పదవి తనను వరించిందంటున్నారు. వరంగల్ జిల్లాలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ అనే పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. అటు వాటర్ గ్రిడ్ ద్వారా నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సర్కారని, కేసీఆర్ ప్రజా నాయకుడని కీర్తించారు.