: ఒబామా నోట 'డీడీఎల్ జే' డైలాగ్!
భారత పర్యటనలో చివరిరోజు ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా... యూనివర్శిటీ విద్యార్థులు, సామాజికవేత్తలతో కనెక్ట్ అయ్యేందుకు బాలీవుడ్ మార్గాన్ని ఎంచుకున్నారు. తన తొలి రెండు నిమిషాల ప్రసంగంలో, 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగె' చిత్రంలోని పాప్యులర్ డైలాగ్ 'సెనోరీటా... బడే బడే దేశోం మే' అన్న డైలాగ్ ను ప్రస్తావించారు. మొదట హిందీలో 'నమస్తే', 'ధన్యవాద్' అంటూ మొదటుపెట్టిన ఒబామా, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, క్రీడాకారుడు మిల్కాసింగ్, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ పేర్లను తన ప్రసంగంలో పేర్కొన్నారు. "ఒంటి రంగును బట్టి కాకుండా, ప్రతి ఒక్క భారతీయుడు షారుక్ ఖాన్, మేరీ కోమ్, మిల్కా సింగ్ ల విజయాన్ని సమానంగా సెలబ్రేట్ చేసుకోవాలి" అని ఒబామా పేర్కొన్నారు. ఆయన మాట్లాడటం ముగిసిన వెంటనే 'లగాన్' చిత్రంలోని 'ఓ మితువా, సున్ మితువా...' పాటను ప్లే చేశారు.