: ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై నేడు నిర్ణయం... చంద్రబాబుతో డిస్కంల కీలక భేటీ


ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై కొనసాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) నేడు విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్ సీ)కి తమ వార్షిక నివేదికలతో పాటు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను కూడా సమర్పించనున్నాయని తెలుస్తోంది. దీనికి ముందు డిస్కంల ఉన్నతాధికారులు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. విద్యుత్ చార్జీల పెంపు తప్పదన్న రీతిలో చంద్రబాబుకు భేటీలో నివేదికలు సమర్పించేందుకు వారు సన్నాహాలు పూర్తి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యుత్ పంపిణీకి సంబంధించి రూ.7 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందంటున్న డిస్కంలు, ప్రభుత్వం ఏ మేర సహాయం చేస్తుందన్న దానిపై విద్యుత్ చార్జీల పెంపు ఆధారపడి ఉంటుందని చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News