: తెలంగాణ సీఎంఓ సిబ్బంది పిల్లలకు స్వైన్ ఫ్లూ... మరో ఐదుగురు వైద్యులకూ వైరస్
ప్రాణాంతక వైరస్ స్వైన్ ఫ్లూ విస్తరణ తెలంగాణలో ఏమాత్రం ఆగడం లేదు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సత్ఫలితాలనివ్వడం లేదు. జంటనగరాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఈ వైరస్, తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుళ్ల పిల్లలకూ సోకింది. ఇప్పటిదాకా మొత్తం 1,050 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 366 మందికి వైరస్ సోకినట్లు తేలింది. సోమవారం ఒక్కరోజే 52 మందికి ఈ వ్యాధి సోకింది. వీరిలో ఐదుగురు వైద్యులు కూడా ఉన్నారు.