: ఆర్కే లక్ష్మణ్ మృతితో... గొప్ప కార్టూనిస్టును కోల్పోయాం: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. లక్ష్మణ్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, నిన్న సాయంత్రం ప్రధాని ట్విట్టర్లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆయన మరణంతో దేశం గొప్ప కార్టూనిస్టును కోల్పోయిందని మోదీ విచారం వ్యక్తం చేశారు. తన విలువైన కార్టూన్లతో కోట్లాది మందిని నవ్వుల్లో ముంచెత్తిన లక్ష్మణ్ మృతి మనందరికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ‘కామన్ మేన్’ పేరిట టైమ్స్ ఆఫ్ ఇండియాలో 50 ఏళ్లకు పైగా తనదైన శైలిలో కార్టూన్లను వేసిన లక్ష్మణ్ నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.