: సినీ పరిశ్రమ కొత్త రాజధాని బాటపడుతుంది: హాస్యనటుడు అలీ
గుంటూరులో ఎన్ఆర్ఐ విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన 10కె రన్ ప్రారంభోత్సవానికి ప్రముఖ హాస్యనటుడు అలీ విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సినీ పరిశ్రమ కొత్త రాజధానికి తరలి వస్తుందని తెలిపారు. సినిమా చిత్రీకరణకు గుంటూరు ప్రాంతంలో అనువైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సినిమా రంగానికి ఎందరో ఆర్టిస్టులను అందించిందని తెలిపారు. ప్రముఖ గాయకుడు మనో కూడా ఈ రన్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... నవ్యాంధ్రలో త్వరలో కొన్ని గీత గుచ్ఛాలను రూపొందించనున్నట్టు చెప్పారు. ఇవి సామాజిక, ఆధ్యాత్మిక నేపథ్యంలో ఉంటాయని వివరించారు.